కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లతోపాటుగా, షుగర్‌ను అదుపు చేసే పదార్ధాలు ఉన్నాయి.

అధిక కేలరీలున్న‌ ఆహారం తీసుకోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహానికి దారితీస్తున్నాయి.

జీవనశైలిలో, ఆహారపు అల‌వాట్ల‌లో కొన్ని మార్పులు చేసుకోవ‌డం ద్వారా మ‌ధుమేహాన్ని అదుపులో పెట్టుకోవ‌చ్చు. 

కీరదోస శరీరంలోని ఇన్సులిన్‌ నిరోధకతను ప్రేరేపిస్తాయి. 

హైపర్ గ్రైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. 

కీరదోసను జ్యూస్‌లాగా తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఎసిడిటి సమస్య తగ్గి వేడిని తగ్గిస్తుంది.

కీర‌దోసను త‌ర‌చూ తీసుకోవ‌డంవ‌ల్ల శ‌రీరంలో కొవ్వులు త‌గ్గిపోతాయి. 

దోస‌కాయ‌ల‌పై తొక్క‌లు కూడా మ‌ధుమేహుల‌కు ఎంతో మేలు చేస్తాయి.

అలాగే 60 ఏళ్ల వయస్సు పైబడిన వారు కీరదోసకాయ జ్యూస్ తాగటం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.