మేకప్‌లో పడుకోవడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది.

రాత్రి సమయంలో మేకప్ కారణంగా చికాకు పుడుతుంది.

దీంతో రాత్రి నిద్రకు భంగం వాటిల్లుతుంది.

రాత్రి పడుకునే ముందు తప్పకుండా క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి.

కంటి మేకప్‌తో నిద్రించడం వల్ల కంటికి చికాకు, దురద వంటి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు.

పగటిపూట మీ చర్మం ప్రీ రాడికల్స్, ఇతర ఆక్సీకరణ ఒత్తిడికి గురవుతుంది.

చివరికి, కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది.

దీంతో ముడతల అభివృద్ధికి కారణమవుతుంది.

మేకప్‌తో నిద్రపోవడం వల్ల ప్రీ రాడికల్స్‌ను రాత్రంతా చర్మం ఉపరితలంపై ఉంచుతుంది.

పగటి పూట మేకప్ లకు బదులుగా చర్మ పోషణకు తోడ్పడే మాయిశ్చరైజర్ రాయడం మంచిది.

దీనివల్ల చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.