పిల్లలను వేధించే మైగ్రేన్

ఇటీవలి కాలంలో నాడీ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే పిల్లల్లో తలనొప్పితో బాధపడేవారు ఎక్కువ.

తలనొప్పికి సంబంధించి పిల్లలను ఎక్కువగా వేధించే సమస్య పార్శ్యపు నొప్పి.

ఎక్కువసేపు ఎండలో ఉండటం, సమయానికి తినకపోవటం, పడుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వల్ల సాయంత్రం వేళలో వస్తుంటుంది.

కొందరిలో చాక్లెట్లు ఎక్కువగా తినటంతోనూ వస్తుంది.

కళ్ల మీద, కంటి వెనకాల నొప్పి వస్తుంటుంది.

కళ్లచుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించడం, ఒకవైపు చూపు మసకబారటం, వికారం వంటివీ ఉంటాయి.

తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ.

నాడీ సమస్యలు, అధిక రక్తపోటు, చూపు సమస్యలు, ముక్కుచుట్టూరా ఉండే గాలి గదుల్లో వాపు , పిప్పి పళ్లు సమస్యలూ తలనొప్పికి కారకాలు.

పార్శ్వనొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించటం మంచిది.