సాధారణంగా శీతాకాలంలో జలుబు, దగ్గులాంటి చిన్న,చిన్న వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. 

మన వంటింట్లో ఉండే   దినుసుల్లో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించి   చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

జీలకర్ర... ఇది నిమోనియా నివారిణిగా ఉపయోగ పడుతుంది. దీనిలో   ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు   విటమిన్-సి ఉంటుంది.  వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో   ఉపకరిస్తుంది

వెల్లుల్లి....కాల్షియం మూలకాన్ని అధికంగా కలిగి ఉంటుంది.   శరీరంలోని అదనపు కొవ్వు కరగడానికి..రక్తప్రసరణ వ్యవస్ధను   మెరుగు పరచటంలో కీలకపాత్ర పోషిస్తుంది

లవంగాలు...జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతాయి.యాంటీ వైరల్,   యాంటీ బ్యాక్టీరియల్ పదార్ధంగా పని చేసి వ్యాధినిరోధక శక్తిని   పెంచుతుంది

అల్లం....దీనిలోని జింగోల్స్ అనే రసాయనాలు శ్వాస వ్యవస్ధను   పటిష్టం చేసి రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి

మెంతులు..... గాలక్టోమన్నన్ అనే యోగకం కండరాల సామర్ధ్యాన్ని   పెంచుతుంది.  ప్రతి 100 గ్రాముల మెంతుల్లో 34 గ్రాముల  ఐరన్   ఉంటుంది. ఫలితంగా రక్తశుధ్ది జరుగుతుంది.

యాలకులు....ఊపిరితిత్తుల్లో గాలి ప్రసరణను పెంచి శ్వాస వ్యవస్ధకు   తోడ్పడుతుంది. వీటిలో బీ1,2,3,6, సీ విటమిన్లు ఉన్నాయి