ఛాంపియన్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన రచిన్ రవీంద్ర?.. ఎవరితను? అతని పేరు వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటి?

బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు.

రచిన్ రవీంద్ర తండ్రికి రాహుల్ ద్రావిడ్, సచిన్ అంటే విపరీతమైన ఇష్టం కావ‌డంతో.. వారి పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. 

రాహుల్‌ ద్రవిడ్‌లో ‘ర’.. సచిన్‌లో ‘చిన్‌’ కలిస్తే 'రచిన్‌ రవీంద్ర'..

2021లో టెస్టుల్లో 2023లో వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వీంద్ర 13 వ‌న్డేలు, 18 టీ20లు, 3 టెస్టులు ఆడాడు.

2023 వరల్డ్ కప్ తొలి మాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకొని  ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

23 ఏళ్ల వయసులో ఎంతో అనుభవమున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని, మొదటి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించిన 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ పేరు క్రికెట్ వ‌ర్గాల్లో మార్మోగిపోతోంది. 

రచిన్ రవీంద్ర లాంటి ఆల్ రౌండర్ ఐపీఎల్ లో ఉండాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు క్యూ కడుతున్నాయి.