సీతా ఫలం గురించి తెలియనివారుండరు..రామా ఫలం ..లక్ష్మణ ఫలాల గురించీ తెలిసే ఉంటుంది.

 మరి పోషకాలు మెండుగా ఉండే  కృష్ణ ఫలం గురించి తెలుసా?

భారతదేశంలో ప్యాషన్ ఫ్రూట్ అని పిలిచే..కృష్ణ ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

జ్యుసిగా ఉండే కృష్ణ పండులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,సి వంటివి చాలా సమృద్దిగా ఉంటాయి.

ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చర్మం ముడతలు పడదు, నిగారింపు వస్తుంది. గాయాలు, అలసటల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఊపిరితిత్తులు బలంగా పనిచేస్తాయి..శ్వాస సమస్యలు తొలగుతాయి.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

హృద్రోగాలను అరికడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.

కృష్ణ పండు చెక్కు తీసి  తినేయొచ్చు. జ్యూస్‌, మిల్క్‌షేక్‌, స్మూథీలుగా కూడా  తీసుకోవచ్చు.