గర్భధారణ సమయంలో తినాల్సి పండ్లు ఏమిటో తెలుసుకుందాం..

Banana : గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు మంచి ఆహారం. ఈ పండులో కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఫోలేట్, విటమిన్ సి, బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

అరటిపండులో ఉండే ఫోలేట్‌ న్యూరల్‌ ట్యూబ్‌ లోపాలనుంచి పిండాన్ని రక్షిస్తుంది. విటమిన్‌ బీ 6 సోడియం స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం వల్ల గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టే.. వికారం, వాంతులు తగ్గుతాయి.

అరటిపండులో ఉండే  ఫోలేట్‌ న్యూరల్‌ ట్యూబ్‌ లోపాలనుంచి పిండాన్ని రక్షిస్తుంది. మెగ్నీషియం వల్ల గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టే.. వికారం, వాంతులు తగ్గుతాయి.

Kiwi : కివిలో విటమిన్ సి, ఇ, ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రెగ్నెన్నీ సమయంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని కివీ రక్షిస్తుంది.

గర్భిణీలు జామకాయను కచ్చితంగా తినాలి. ఇందులో విటమిన్ సి, ఈ, ఐసో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. జామకాయ జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. శిశువు యొక్క నాడీ వ్యవస్థకు బలాన్ని అందిస్తుంది.

Apples : గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తినాల్సి పండు ఆపిల్‌. ఆపిల్‌ తింటే శిశివు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకు పుట్టిన తర్వాత శ్వాసకోస సమస్యలు, ఆస్తమా, దగ్గు, తామర వంటివి రాకుండా ఉంటాయి. ఆపిల్‌లో విటమిన్‌ ఏ, ఈ, సీ, జింక్‌ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

కమల పండ్లు.. Orange : కమలాపండ్లలో ఉండే విటమిన్ సి.. శిశువు ఎముకలు, దంతాల నిర్మాణం, పెరుగుదలకు అవసరం. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. దీంట్లోని ఫోలేట్స్‌ శిశివు మెదడు ఎదుగుదలకు సహాయపడుతుంది.

apricots : ఆప్రికాట్‌లో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు,మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఎండిన ఆప్రికాట్‌లలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.