స్నానం నీటిలో లావెండర్, రోజ్‌మెరీ, టీట్రీ ఆయిల్.. ఇలా నచ్చినదాన్ని ఎంచుకొని కొన్ని చుక్కలు వేయండి.

రోజుకు కనీసం రెండు సార్లు గోరువెచ్చని, చన్నీటితో స్నానం చేయండి.

కొన్ని వేపాకులు లేదా టొమాటో రసాన్ని చెమట ఎక్కువగా పోసే చోట రాసి, పది నిమిషాలు పూర్తయ్యాక కడిగేయండి. రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

పచ్చి బంగాళాదుంప ముక్కను తీసుకొని బహుమూలాల్లో పది నిమిషాలు రుద్దండి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే సరి. ఫేస్ట్‌లా చేసి పెట్టినా ఫలితం ఉంటుంది.

చెమట ఎక్కువగా పోసేవారు నిమ్మ, ఆపిల్ సిడార్ వెనిగర్, బేకింగ్ సోడా వంటివి చర్మానికి పూయకపోవడం మంచిది.

అలోవెరాలో యాంటీ మైక్రోబియల్ గుణాలెక్కువ. అలోవెరా జెల్‌లో ముంచిన కాటన్‌తో బహుమూలలను శుభ్రం చేసుకోండి.

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో నీటిది ప్రధాన పాత్ర. తక్కువ నీరు తీసుకోవడం వల్ల అవి శరీరంలోనే ఉండిపోయి దుర్వాసనకు కారణమవుతాయి.

కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. గ్లాసు నీటిలో చెంచా మెంతులు రాత్రంతా నానబెట్టి, రోజూ తాగినా ప్రయోజనం ఉంటుంది.

ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. నూనెపదార్థాలు, కారం శరీరంలో ఆసిడ్ లకు కారణమవుతాయి. దీంతో చెమట పెరుగుతుంది. ప్రొబయాటిక్స్ ఎక్కువగా ఉండేవి బాగా తీసుకోవాలి.