టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్‌లోని
సుదర్శన్ 35ఎంఎం థియేటర్లో నిర్వహించారు.
ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలతో పాటు లైగర్ చిత్ర యూనిట్ హాజరయ్యింది.
విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలకు అదిరిపోయే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు అభిమానులు.
తనపై ఇంత ప్రేమను చూపిస్తున్న అభిమానులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.
లైగర్ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు
పూరీ జగన్నాధ్ అన్నారు.
ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అనన్యా పాండే తెలిపింది.
రౌడీ రాక్స్.. లైగర్ రాక్స్.. అంటూ కరణ్ జోహర్ ఈ సినిమా క్రేజ్‌ను రెట్టింపు
చేశాడు.
మొత్తానికి అభిమానుల కోలాహలం మధ్య లైగర్ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరగడంతో, ఈ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.