అరుణాచల్‌ప్రదేశ్‌ లో..  100 ఏళ్ల తర్వాత కనిపించిన  ‘లిప్ స్టిక్’ మెక్క..

అరుదైన "లిప్‌ స్టిక్‌" మొక్కను బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(BSI) పరిశోధకులు గుర్తించారు.

లిప్‌స్టిక్‌ మొక్క శాస్త్రీయ నామం  ‘ఎస్కినాంథస్ మానటేరియా’..

ఈ మొక్కను  ఇండియన్ లిప్ స్టిక్ ప్లాంట్  అని కూడా పిలుస్తారు..

దీని పువ్వులు లిప్‌స్టిక్‌లాగా ఎర్రటి రంగులో ఉంటాయి.

లిప్‌ స్టిక్‌ మొక్కను మొట్టమొదటిసారిగా 1912లో బ్రిటిష్‌ శాస్త్రవేత్త స్టీఫెన్‌ డ్యూన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లోనే కనుగొన్నారు.

లిప్‌స్టిక్‌ మొక్క ఐయూసీఎన్‌ అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఉందని బీఎస్‌ఐ శాస్త్రవేత్త కృష్ణ చౌలు తెలిపారు.

ఈ మొక్క 543 నుండి 1134 మీటర్ల ఎత్తులో తేమ మరియు సతత హరిత అడవులలో పెరుగుతుంది.

అక్టోబర్ - జనవరి మధ్యలో ఈ మొక్క పువ్వులు పూస్తుంది. కాయలు కాస్తుంది.