రైళ్లలో సుదూర ప్రయాణాలు చేసే మహిళా ప్రయాణికులకు శుభవార్త..

మహిళలు రైళ్లలో ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా భారతీయ రైల్వే శాఖ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెడుతోంది.

రైల్లో సుదూర ప్రయాణాలు  చేసే మహిళల కోసం ఈ కొత్త రిజర్వేషన్లు తీసుకొస్తోంది. 

మహిళలు కోరుకున్న చోట సీట్లు, బెర్తులను రైల్వే శాఖ కేటాయించనుంది. 

దూర ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేసే మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి రిజర్వడ్ బెర్త్స్ తీసుకొస్తోంది. 

దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లు,  మెయిల్ రైళ్లు, స్లిపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు కేటాయించనుంది రైల్వే శాఖ.

రైల్లో ప్రయాణించే మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా రిజర్వేషన్ కోటా వర్తించనుంది. 

 రైళ్లలో కోచ్‌ల సంఖ్య ఆధారంగా  సీట్ల రిజర్వడ్ కోటా  నిర్ణయించనుంది.