శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేయడంలో నల్ల మిరియాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. రోజు తీసుకుంటే..బ్యాడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
నల్ల మిరియాల టీ తాగితే..కేలరీలను కరిగిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఆకలి పెద్దగా వేయదు. దీంతో శరీరం బరువు పెరుగకుండా ఉంటుంది.
నల్ల మిరియాలో ఉండే యాంటీ ఆన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహకరిస్తాయి.
నల్ల మిరియాలు వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల నుంచి రక్షిస్తాయి..
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి..ఒత్తిడి, డిప్రెషన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కొన్ని మిరియాలను తీసుకుని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.
ఒక చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.