బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే బరువును ఈజీగా తగ్గేందుకు అవకాశం ఉంది.
భోజనానికి ముందు కూరగాయలు, ఆకుకూరలు , సలాడ్ లు తీసుకోవాలి..
నిద్రలేచిన గంటలోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తినటం వల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
ప్రతిరోజు పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి.
ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకునే సమయంలో హాడాహుడిగా తినొవద్దు..
వ్యాయామం చేసిన తరువాత 30 నిమిషాల లోపు భోజనం చేయటం మంచిది.
భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండుతింటే బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో తేలింది.
వారంలో మూడు రోజలు గుడ్లు , ఒకపూట చేప తినడం వల్ల బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.
మిరియాలు, మిర్చిలను ఆహారంలో తగు మోతాదుల్లో వాడటం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.