మీ ట్రైన్ టికెట్ పోయిందా? చిరిగిపోయిందా? అయినా డోంట్ వర్రీ.

రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ పోయినా, చిరిగిపోయినా ఇక బాధపడాల్సిన అవసరం లేదు.

ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వేస్.

డూప్లికేట్ ట్రైన్ టికెట్ తీసుకునే వెసులుబాటు.

రైల్వే స్టేషన్స్‌లో ఉండే PRS (Passenger Reservation System) కౌంటర్ దగ్గరికి వెళ్లాలి.

జరిగిన విషయం వారితో చెప్పాలి.

స్టేషన్ మాస్టర్‌ను కూడా సంప్రదించవచ్చు.

ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ పోయినా, చిరిగినా డూప్లికేట్ టికెట్ ఇస్తారు.

ఛార్ట్ ప్రిపేర్ కాకముందు క్లరికేజ్ ఛార్జీలు చెల్లిస్తే డూప్లికేట్ టికెట్ ఇస్తారు.

ఛార్ట్ ప్రిపేర్ కాకముందు అయితే RAC టికెట్ కలిగిన వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఇక, ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక వెళ్తే టోటల్ ఫేర్‌లో 50శాతం వసూలు చేస్తారు.

ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక RAC టికెట్ కలిగిన వారికి ఈ సదుపాయం వర్తించదు.

ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే..

IRCTC అకౌంట్‌లోకి వెళ్లి టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.