ప్ర‌పంచంలోనే అతిపెద్ద న‌దీ ప‌ర్య‌ట‌క నౌక గంగా విలాస్‌

భార‌త‌దేశంలోని మొట్టమొద‌టి న‌దీ ప‌ర్య‌ట‌క నౌక‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 13వ తేదీన వార‌ణాసిలో ప్రారంభిస్తారు. 

గంగా, బ్ర‌హ్మ‌పుత్ర న‌దుల మీదుగా 3,200 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. 

భార‌తీయ సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా నౌక‌ను రూపొందించారు. 

నౌక‌లో ప్ర‌యాణికుల కోసం అత్యాధునిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. 

సూట్ గ‌దులు, స్పా , జిమ్ సెంట‌ర్లుకూడా అందుబాటులో ఉన్నాయి. 

51రోజుల సుదీర్ఘ ప్ర‌యాణంలో 50 ప‌ర్య‌ట‌క స్థ‌లాల్లో ఈ నౌక ఆగుతుంది.

భార‌త్‌లోని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌, అస్సాంతో పాటు బంగ్లాదేశ్‌లోని న‌దుల్లో నౌక ప్ర‌యాణిస్తుంది.

గంగా విలాస్ 62 మీట‌ర్ల పొడ‌వు, 12 మీట‌ర్ల వెడెల్పు ఉంటుంది. 

36 మంది ప్ర‌యాణికులు ఇందులో ప్ర‌యాణించొచ్చు. 

టికెట్ ధ‌ర‌.. ఒక్కో ప్ర‌యాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు

ల‌గ్జ‌రీ క్రూజ్ లో 51రోజులు ప్ర‌యాణించాలంటే రూ.12.75ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంది.