టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సినిమాలకు తన వాయిస్ ఓవర్ అందించాడు.
మహేష్ వాయిస్ ఓవర్ అందించిన సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ సినిమాలో మహేష్
వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బాద్‌షా’ మూవీకి కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రానికి కూడా మహేష్ బాబు వాయిస్ అందించాడు.
సందీప్ కిషన్ నటించిన ‘మనసుకు నచ్చింది’కి కూడా మహేష్ వాయిస్ ఓవర్
ఇచ్చాడు. మంజులా ఘట్టమనేని డైరెక్ట్ చేశారు.
హీరో అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ సినిమాను మహేష్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
ఇలా కేవలం నటనతోనే కాకుండా తన వాయిస్‌తోనూ సినిమాలపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో మహేష్ సక్సెస్ అయ్యాడు.