మైదాపిండి ఆహారంగా చేసుకోవటం హానికరమా?
మైదాపిండిలో ఎలాంటి పోషకాలు లేవా, అంతా రసాయనమేనా.. అదెంత వరకూ నిజం
ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడటంపై ఆంక్షలు విధించాయి.
గోధుమ పిండిని మైదాపిండిగా మార్చే క్రమంలో పోషకాలు తొలగిపోతాయి.
ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఈ పిండిలోకి రసాయనాలు చేరి ఎటువంటి పోషకాలు లేకుండాపోతాయి.
ఇది తినడం వల్ల కడుపునిండిన భావన మాత్రమే కలుగుతుంది
అంతేకాకుండా బరువు పెరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశముంది.
ఆమ్లత్వంతో కూడిన మైదా ఎముకలకు హాని చేస్తుంది.
మైదాతో తయారయ్యే ఆహారపదార్ధాల్లో అధిక నూనె వినియోగం వల్ల చెడు కొవ్వులు పెరిగే ప్రమాదం ఉంది.
తద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
ఇటీవలి కాలంలో బేకరీ ఐటమ్స్, స్వీట్లు తయారీలో మైదాను విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఎలాంటి పోషకాలు లేని ఈ పిండి తినడం వల్ల అంతా నష్టమేనని నిపుణులు చెబుతున్నారు.