వేసవిలో మామిడి పండ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు..

మామిడి ఆకుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే విటమిన్ సి, బి, ఏ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.

మామిడి ఆకులను ఆయుర్వేదం, సాంప్రదాయ చైనీస్ ఔషధంగా అనేక వైద్యం పద్ధతులలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

ఈ ఆకుల్లో పాలీఫెనాల్స్,టెర్పెనాయిడ్స్ ఉన్నాయి. సరైన దృష్టి, రోగనిరోధక ఆరోగ్యానికి టెర్పెనాయిడ్స్ ముఖ్యమైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుండి మీ కణాలను రక్షిస్తాయి.

పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీలక్షణాలను కలిగి ఉంటాయి. గట్ బాక్టీరియాను మెరుగుపరుస్తాయని పరిశోధనల్లో తేలింది.

ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు,క్యాన్సర్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో, నిరోధించడంలోసహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మామిడి ఆకులను మధుమేహ చికిత్సలో ఉపయోగిస్తారు.మామిడి ఆకులను ఎండబెట్టి పొడిని తయారు చేయండి. ఈ పొడిని క్రమం తప్పకుండా తినండి.

అలాగే మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకుల నీటిని రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఈ ఆకులను ఉదయాన్నే వడపోసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.