మనం డ్రై ఫ్రూట్స్ గా తీసుకునే వాటిల్లో ఎండు ద్రాక్ష ఒకటి.
ఎండు ద్రాక్ష వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ ఒక పూట వీటిని తినడం వల్ల అజీర్తి సమస్య రాకుండా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బలంగా, దృఢంగా ఉండడమే కాకుండా మానసిక స్థితి మెరుగుపడుతుంది.
రక్త హీనత సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం ఉంటుంది
నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను పరగడుపున తీసుకోవాలి. నీరసం, అలసట తగ్గుతాయి.
దంతాల నొప్పులను తగ్గించడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, నిద్ర లేమి సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
వానాకాలం సీజన్లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.