బీన్స్ పప్పుధాన్యాల కూరగాయల క్యాటగిరి కిందికి వస్తుంది.

బీన్స్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు వీటిలో ఉంటాయి.

బీన్స్ గింజలను తింటే గొంతు, కడుపు నొప్పి, వాపు తగ్గుతాయి.

చలికాలంలో వీటిని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్ మెరుగ్గా ఉంటాయి. 

ఐరన్ లోపం ఏర్పడకుండా కాపాడుతుంది.

రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషించే మూలకాలను కలిగి ఉంటాయి.

రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతాయి.

మహిళలు ఈ బీన్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

పీరియడ్స్ సక్రమంగా రాలేదని ఫిర్యాదుచేసే మహిళలకు ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి.

శరీరం బరువు సులభంగా అదుపులో ఉంటుంది.

చలికాలంలో శరీరంలో వాపు ఉంటే వాచిన ప్రదేశంలో గ్రౌండ్ ఫావా గింజలను పూయడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.