పుల్లగా పచ్చిమామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది...

విటమిన్ సి అధికంగా ఉండే పచ్చి మామిడి బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి మార్గం..పచ్చడి, కూరల్లో వాడుకోవచ్చు..

పచ్చి మామిడి రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటుగా కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది.

వేసవిలో చెమట అధికంగా పట్టటం వల్ల లవణాలను ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. పచ్చిమామిడి కాయ రసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే సమస్య నుండి బయటపడవచ్చు.

చిగుళ్ళు ఇన్ ఫెక్షన్లు, రక్తం కారటం, పన్ను నొప్పి వంటి సమస్యలుంటే..పచ్చి మామిడి కాయ ముక్కలను నమిలి తినటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.

పచ్చి మామిడితో నోటిలోని బ్యాక్టీరియా, క్రిములూ నశిస్తాయి. దంతాలు శుభ్రమవుతాయి. పళ్ల మీద ఎనామిల్ పోకుండా ఉంటుంది.

పచ్చి మామిడి తింటే నోటి దుర్వాసన పోతుంది...

పచ్చి మామిడి తినటం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను పోగొడతాయి.

పచ్చి మామిడి తింటే వేసవిలో వచ్చే చెమటకాయలు తొలగిపోతాయి.

గర్భిణులకు వాంతులూ, వికారం వల్ల అసౌకర్యం కలిగిన సందర్భంలో పచ్చిమామిడి తింటే ఉపశమనం లభిస్తుంది.

ప‌చ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాలను సుర‌క్షితంగా ఉంచుతాయి.

ప‌చ్చి మామిడికాయ‌ల్లో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తుంది.

ప‌చ్చి మామిడి కాయ‌ల్లో లుటీన్‌, జియాజాంతిన్ అనబ‌డే యాంటీ ఆక్సిడెంట్లు క‌ళ్ల‌లోని రెటీనాను సంర‌క్షిస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి.