డిజిటల్ కంటి ఒత్తిడి అంటే? కళ్లను కాపాడుకోవడం ఎలా?

కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడే డిజిటల్ యుగంలో ఉన్నాం. 

కళ్లకు అదనపు రక్షణ తప్పనిసరిగా అవసరం.

ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపటం వల్ల..

తలనొప్పి, కళ్ళు పొడిబారడం, కంటి చూపు లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.

స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల..

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలువబడే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనే సమస్య కలుగుతుంది. 

ఇది మన కళ్ళకు హానికరం. 

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం వల్ల వస్తుంది. 

స్క్రీన్‌లు విడుదల చేసే బ్లూ లైట్ వల్ల సమస్యలు తలెత్తుతాయి. 

కొన్ని సాధారణ చిట్కాల సహాయంతో స్క్రీన్‌లకు ఎక్కువగా బహిర్గతం కాకుండా చూసుకోవచ్చు.

డిజిటల్ స్క్రీన్ పరికరం నుండి సౌకర్యవంతమైన దూరాన్ని పాటించాలి.

స్క్రీన్ కాంట్రాస్ట్‌ను తగ్గించాలి.

బ్లూ లైట్ ఫిల్టర్ ప్రమాదకరమైన నీలి కాంతికి గురి కావడాన్ని తగ్గిస్తుంది.

స్క్రీన్ ల ముందు గడిపే సమయాన్ని తగ్గించుకోవాలి. 

కళ్ళకు అవసరమైన విశ్రాంతిని అందించడానికి దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి.