లేత ఉల్లికాడలు  గొప్ప రుచిని, పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి

ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది

ఉల్లికాడలలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్  ఉన్నాయి

ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయ పడుతుంది

ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి

ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోజ్ శక్తిని పెంచుతుంది

ఉల్లికాడలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయ పడుతుంది

ఉల్లికాడలలోని  యాంటి హిస్టమైన్ పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు  ఔషధంగా పని చేస్తుంది

ఉల్లికాడలలో స్ధూల పోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది