వంటింట్లోని పోపుల పెట్టెలో ఉండే ఆవాలులో ఎన్నో జౌషధ రహస్యాలు ఉన్నాయి

చాలా మంది ఆవకాయ పెట్టుకోటానికి పోపు పెట్టుకోటానికే ఆవాలు ఉపయోగం అనుకుంటారు

మూత్ర సంబంధింత వ్యాధుల్లో ఆవాలు బాగా పని చేస్తాయి. ఆవాలు ప్రధానంగా  నెర్వస్ సిస్టం మీద పని చేస్తాయి

ఆవాల పొడిని సలాడ్స్, సూప్స్ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది

తేలు కుట్టినప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ బెల్లం, రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నూరి  తేలు కుట్టిన చోట పెడితే...విషం తాలుకా తీవ్రతను తగ్గిస్తుంది. ఆతర్వాత వైద్యం చేయించుకోటానికి డాక్టర్ దగ్గరకు వెళ్లవచ్చు

బరువు తగ్గడానికి ఆవగింజలు చాలా మంచివి.. అవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆవగింజలలో 32 కేలరీలు కలిగి ఉంటుంది

ఆవగింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ B1, ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, డైటరీ ఫైబర్ & జింక్ వంటివి ఉన్నాయి

గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది

ఆస్తమా & రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడానికి  ఆవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి

ఆవాలలో ఉండే మెగ్నీషియం, రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది

ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది. ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది