శరీరానికి..  కొవ్వు చేరనివ్వని ఆహారాలే తినాలి..

అలాగే శరీరంలో కొవ్వు కరిగించే ఆహారాలు కూడా తినాలి..అవేమిటంటే..

ఆపిల్ : రోజుకొక ఆపిల్ పండు తినటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించుకోవచ్చు..

పచ్చిమిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే పదార్ధం శరీరంలో నిల్వ ఉన్న కేలరీలను కరిగిస్తుంది..

వెల్లుల్లిలోని ఆలిసిన్ అనే రసాయనం యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తూ... శరీరంలోని కొవ్వును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..

డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లవనాయిడ్స్ బాధ నివారణకారకాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించి.. కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది..

టమాటోలు క్యాన్సర్ ను కలిగించే కణాలను నాశనం చేయటమేకాదు..  కొవ్వును త్వరగా కరిగించేస్తాయి..

గోధుమ గడ్డి శరీరంలో పేరుకున్న కొవ్వులను  తగ్గించటానికి చక్కటి మార్గం..

గ్రీన్ టీ..శరీర బరువును క్రమపద్దతిలో ఉంచుతుంది..రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే కొవ్వు కరిగేలా చేస్తుంది..

గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని ప్రతిరోజు పరగడుపున తాగితే..  శరీరంలో కొవ్వులు కరిగిపోతాయి..

కోడిగుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గుతాయి. కండరాలకు బలం కూడా..

ఓట్స్ : ఓట్స్ లో ఫైబర్ శరీరంలోని.. కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తాయి..