వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి కోల్పోతుంటాం..కానీ జ్ఞాపకశక్తి మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా?!
మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. అలాంటి ఆహారాలేంటో తెలుసుకుందాం..జ్ఞాపకశక్తిని పెంచుకుందాం..
గుమ్మడి గింజలు : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
గుడ్లు : వీటిలో ఉండే విటమిన్ బీ6 వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతుంది..
నారింజలో ఉండే విటమిన్ సి, మెదడుని చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకసక్తి పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లూ బెర్రీలని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలని ఆహారంగా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపక శక్తి బాగుంటుంది. (ఉదా:ట్యూనా, సాల్మన్ చేపలు)
ఆకుపచ్చని కూరగాయలు ఫొలేట్, విటమిన్ బీ9 అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. (ఉదా : పాలకూర,బచ్చలికూర బ్రొక్కోలీ)
వాల్ నట్స్, బాదంపప్పు, బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు వంటి గింజలు
పెరుగు తప్పకుండా తీసుకోవాలి. యుగర్ట్ తో జింక్, విటమిన్ బీ, ప్రొబయాటిక్, డీ విటమిన్ లభిస్తాయి. మెదడు ఆరోగ్యానికి, కాలేయం, గుండె పనితీరుకు ఉపయోగపడతాయి