నెలసరి సమయంతో తీసుకోకూడని ఆహారం

ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారం, చిప్స్, అధిక కొవ్వు, ఉప్పు, పుల్లని పదార్థాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.

శీతలపానీయాలు తాగడం వల్ల నెలసరి నొప్పులు మరింత పెరుగుతాయి. 

కాఫీ వంటి కెఫీన్‌ కలిగిన వాటిని తీసుకోకపోవటమే మంచిది. 

ఆల్కహాల్ వినియోగం తగ్గించండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అసౌకర్యం పెరుగుతుంది. 

మహిళలకు పీరియడ్స్ సమయంలో అధిక ఉప్పు కూడా సమస్యాత్మకంగా మారుతుంది. 

ఉప్పుతో కూడిన చిప్స్‌, పచ్చళ్లు. చాలా సోడియంను కలిగి ఉండి.. ఇది నొప్పిని పెంచుతుంది. 

మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి.

ఫలితంగా రొమ్ముల్లో సలపరం, మూడ్‌ స్వింగ్స్‌, ఒళ్లు బరువుగా ఉండడం లాంటి నెలసరి సమస్యలు వేధిస్తాయి.

పచ్చి ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లు, అరటిపండ్లు, పెరుగు, సాల్మన్ చేపలు, గింజలు మొదలైనవి ఎక్కువగా తినాలి.

 బహిష్టు సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి.