చర్మం నిగనిగలాడేందుకు పాలపొడి ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా..?

దుమ్మూధూళి, ఎండ, కాలుష్యం.. మన చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తాయి.

అందం కోసం పాలపొడి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.  ఇందులోని విటమిన్లు చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి.

పాలపొడిలో విటమిన్లు,  మినరల్స్‌ అధికమొత్తంలో ఉంటాయి.

లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తుంది.

కొలాజిన్‌ ఉత్పత్తిని  పెంచి చర్మం  ఆరోగ్యంగా ఉండేలా  చేస్తుంది.

రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి అంతే పరిమాణంలో టీ డికాక్షన్‌ నీళ్లు, ఒక టేబుల్‌ స్పూన్‌ పాలపొడి, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కొంటే మృతకణాలు తొలగి మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

టేబుల్‌ స్పూన్‌ పాలపొడిలో, నాలుగు టేబుల్‌ స్పూన్ల కీరదోస ముక్కలు, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, చిటికెడు పసుపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి.

రోజ్ వాటర్,  రెండు  స్పూన్‌ పాలపొడి, కొద్దిగా పెరుగు, టేబుల్‌ స్పూన్‌ చొప్పున వెనిగర్, తేనె కలిపి ముఖానికి పూతలా వేయండి. ఇలా చేస్తే చర్మం తాజాగా మెరిసిపోతుంది.