చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారపదార్ధాలతో పోషకాహార లోపాన్ని నివారించవచ్చు..

చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి.

కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు వంటి చిరుధాన్యాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..

గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి సమస్యల తృణ ధాన్యాలతో ఉపశమనం పొందొచ్చు..

డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అరికెల‌ను తింటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ దరిచేరదు.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఊద‌ల‌ను తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌జ్జ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రావు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ రాదు.

శ‌రీరానికి రాగులు చ‌ల‌వ చేస్తాయి. ఎండ‌కాలంలో వీటిని తీసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం క‌లుగుతుంది. ర‌క్తవృద్ధి పెరుగుతుంది..శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు సామ‌ల‌ను తింటే ఎముక‌లు, న‌రాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్స‌ర్ రాదు.

సామ‌లు తింటే  బాలింత‌ల్లో  పాలు ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తాయి.

అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డేవారు కొర్ర‌ల‌ ఆహారం తింటే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గుండె జ‌బ్బులు రావు. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.