ఉగాది పచ్చడి..షడ్రుచుల సమ్మేళనం. అంటే ఆరు రుచుల సమ్మేళనం..

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు  మేళవింపు ఉగాది పచ్చడి..

ఈ ఆరు రుచులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు..అవేంటో తెలుసుకుందాం..

మామిడి పిందెల వగరు,పులుపు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నివారిస్తుంది.

వేపు పువ్వులోని చేదులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బ్లడ్ షుగర్ శాతాన్ని తగ్గించి మధుమేహ సమస్యను నివారిస్తాయి. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించే గుణం కూడా కలిగి ఉంది. ఇది మనకు ఆరోగ్యకరమైన శారీరక స్థితిని ఇస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

బెల్లం అంటే తీపి..వాతం, పిత్తం, సమస్యలను తగ్గించి, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయాన్ని శుభ్రపరిచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. శరీరంలో ఐరెన్ కంటెంట్ ను పెంచుతుంది..

కారం కోసం మిరియాలు లేదా పచ్చిమిర్చిలతో శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. శ్వాసకోస సమస్యలను రాకుండా చేస్తుంది. జీవక్రియను పెంచుతాయి. అజీర్తి, మానసిక కుంగుబాటు, దగ్గు, ప్రాణాంతక క్యాన్సర్ సమస్యలు రాకుండా చేస్తాయి.

ఉప్పుతో మన జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా కలిగిస్తుంది. కానీ ఉప్పును తగినంతే తీసుకోవాలి..మోతాదుకు మించి తింటే గ్యాస్, ఎసిడిటీ, మూత్రపిండాల సమస్యలు వస్తాయి.

చింతపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.చింతపండు శరీరం మినరల్స్ ని తేలికగా గ్రహించగలిగేలా చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ లేకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇలా ఉగాది పచ్చడిలో ఉండే తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే ఆరు రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయని మన పెద్దలు చెప్పారు.నిపుణులు చెబుతున్నారు..