మంకీపాక్స్‌ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండాలి.

రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదు.

ఒకవేళ వెళితే మాస్క్ ధరించాలి.

ఇంటికి రాగానే స్నానం చేయాలి.

ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలి.

మాస్క్‌ తప్పనిసరి.

జ్వరం, తలనొప్పి, నడుంనొప్పి, వాపులు, కండరాల నొప్పి, అలసట లాంటివి మంకీపాక్స్ లక్షణాలు.

స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి.

ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది.