బంగారం కొంటున్నారా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

బంగారం స్వచ్ఛతను తెలుసుకోండి

24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛమైనది.

మేకింగ్ ఛార్జీలు

మేకింగ్ ఛార్జీల విషయంలో కస్టమర్లు మోసపోయే ఛాన్స్ ఎక్కువ. 

ప్రతి బంగారు ఆభరణానికి మేకింగ్ ఛార్జీలు ప్రస్తుత బంగారం ధరలలో ప్రతిబింబిస్తాయి.

మ్యాన్ మేడ్ లేదా మెషీన్ మేడ్

యంత్రంతో(మెషిన్) తయారు చేసిన ఆభరణాలు, మానవ నిర్మిత ఆభరణాల ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. 

యంత్రంతో తయారు చేయబడిన ఆభరణాల ధర చౌకగా ఉంటాయి.

బరువును చెక్ చేయండి

బంగారు ఆభరణాలను తూకంలో విక్రయిస్తారు. ముక్క ఎంత బరువైతే ధర అంత ఎక్కువగా ఉంటుంది.

అమ్మకాలు.. బంగారం ఎప్పుడు కొనాలి?

ఆఫ్ సీజన్ లో లేదా ఆఫర్లు ఉన్నప్పుడు బంగారం కొనడం మంచిది.