మాయావతి

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు బీఎస్పీ సుప్రెమో మాయావతి. దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈమె అన్నిసార్లు సీఎం పీఠాన్ని అందుకోవడాన్ని గొప్పగా చెప్తుంటారు

మమతా బెనర్జీ

కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ.. బెంగాల్‭లో వరుసగా మూడుసార్లు పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లారు. బీజేపీకి ఛాలెంజ్ విసరడంతో దీదీ తరవాతే ఎవరైనా

జయలలిత

ద్రవిడ రాజకీయాల్లో జయలలిత అమ్మలా వెలుగొందారు. ఏకంగా ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, అతి ఎక్కవసార్లు మహిళా ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు

రబ్రీ దేవి

లాలూ భార్య హోదాలో బిహార్ సీఎంగా ప్రమాణం చేసిన రబ్రీ దేవి.. మూడుసార్లు ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా 7 ఏళ్లకు పైగా పాలించారు

షీలా దీక్షిత్

1998 నుంచి 2013 ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు షీలా దీక్షిత్. దేశ రాజధానిని నిరాటకంగా 15 ఏళ్లకు పైగా పాలించారంటే షీలా రాజకీయ సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు

వసుంధర రాజే

బీజేపీ నుంచి బలమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా వసుంధర రాజేను చెప్పుకోవచ్చు. పార్టీలోనే కాదు, ప్రభుత్వాన్ని స్వతంత్రంగా నడపడంలో ఆమెకు ఆమే సాటి

శశికల కకోద్కర్

గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలైన శశికళ కకొడ్కర్, గోవా ముఖ్యమంత్రిగా పూర్తికాలం పని చేశారు. ఆమెను చాలా మంది అక్క అని పిలిచేవారు

మెహబూబా ముఫ్తీ

జమ్మూ కశ్మీర్ మొదటి మహిళా సీఎం మెహబూబా ముఫ్తీ.. తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ మరణం అనంతరం, పూర్తి విరుద్ధ భావజాలం ఉన్న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు ముఫ్తీ