కొందరికి రోడ్డు ప్రయాణాల్లో పదేపదే వాంతులొస్తుంటాయి.. బస్సులో, కార్లలో,షిప్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్నెస్ అంటారు.
ఇది మానసిక సమస్యా అంటే కాదు అంటున్నారు వైద్యులు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు.
పుదీనా కూడా వాంతులను తగ్గించడంలో చాలాగొప్పగా సహాయ పడుతుంది. ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగించి ప్రయాణానికి ముందు తీసుకోవాలి. పుదీనా ఆకు నుండి వచ్చే సువాసన కూడా వాంతులు మరియు వికారం తగ్గిస్తాయి.