ఇటీవల కాలంలో సినిమాలని ఎన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశామన్నది కూడా రికార్డుగా మారుతుంది. దేశ, విదేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూలకి మన సినిమాలు చేరుతున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల అయిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే..

తాజాగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10200కు పైగా స్క్రీన్స్‌లో విడుదలై ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.

ప్రభాస్ ‘బాహుబలి 2’ సినిమా 8500 స్క్రీన్స్‌లో విడుదల అయి రెండో ప్లేస్‌లో ఉంది. ఆర్ఆర్ఆర్ రాకముందు వరకు ఇదే అగ్రస్థానంలో కొనసాగింది.

ప్రభాస్ 'సాహో' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7970కి పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది.

ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7000 స్క్రీన్స్‌లో విడుదల అయింది.

మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' ప్రపంచ వ్యాప్తంగా  4600లకు పైగా స్క్రీన్స్‌లో విడుదల అయింది.

ప్రభాస్ 'బాహుబలి 1' ప్రపంచ వ్యాప్తంగా 4000 పైగా స్క్రీన్స్‌లో విడుదల అయింది.

ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్స్‌లో విడుదల అయింది.

పవన కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2800 స్క్రీన్స్‌లో విడుదల అయింది.

పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2600 స్క్రీన్స్‌లో విడుదలయింది.

మహేష్ బాబు 'స్పైడర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2400 స్క్రీన్స్‌లో విడుదల అయింది.