ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అయిన మూడు వారాల వరకు ఏ పెద్ద సినిమా పోటీకి రాలేదు. ఈ వారం తెలుగు సినిమాలేవీ లేకపోయినా ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదల కానుంది.

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'కెజిఎఫ్ 2' ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

తెలుగు రీమేక్ బాలీవుడ్ 'జెర్సీ' సినిమా కూడా ఏప్రిల్ 14న రిలీజ్ అనుకున్నారు కానీ 'కెజిఎఫ్ 2' ధాటికి 'జెర్సీ' నిలబడదని అర్థమయి ఈ సినిమాని వాయిదా వేశారు.