పుట్టగొడుగులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు.

వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో పుట్టగొడుగులు ఎంతో తోడ్పడతాయి. కొవ్వును కరిగించే D విటమిన్ పుట్టగొడుగుల్లో ఉంటుంది.

వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులను తీసుకోవటం వల్ల వీటిలో ఉండే లెంటిసైన్, ఎరిటడెనిన్ లు కొవ్వును కరిగేలా చేస్తాయి.

దీంతో బాడీలో కొవ్వు శాతం తగ్గుతుంది. హైబీపి, గుండె జబ్బులను దరిచేరకుండ చూసుకోవచ్చు.

మహిళల గర్భసంబంధిత రోగాలు, మోకాలి నొప్పులను దూరం చేయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయటంలో ఇవి ఉపకరిస్తాయి.

పుట్టగొడుగుల్లో ఉండే విట‌మిన్ C గుండెకు మేలు చేస్తుంది. పొటాషియం బ్లడ్ ప్రెష‌ర్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

పుట్టగొడుగుల్లో..పుష్కలంగా D విట‌మిన్ దొర‌కుతుంది. ఇది ఎముక‌ల దృఢ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఒక కప్పు కట్ చేసిన మష్రూమ్ ముక్కల్లో 15 కేలోరీల శక్తి, 2.2 గ్రాముల ప్రోటీన్, 2.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.7 గ్రాములఫైబర్, 1.4 గ్రాముల చక్కెరలు ఉంటాయి.

విటమిన్ బి, విటమిన్ బి2, ఫోలేట్ , థయమిన్ , పాంటోథెనిక్ యాసిడ్ , నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. బి విటమిన్లు మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి.