నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’.

మార్చి 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.

ఈ సినిమా కోసం నాని రా అండ్ రస్టిక్ లుక్‌లోకి మారిపోయాడు.

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

పాన్ ఇండియా మూవీగా దసరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నాని పలు నగరాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా నాగ్‌పూర్‌లో నాని దసరా ప్రమోషన్స్‌ను ధూంధాంగా నిర్వహించాడు.