సహజంగా బరువు తగ్గించటానికి సగ్గు బియ్యం   మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు.

సగ్గు బియ్యం శరీరంలో అధిక వేడి ఉన్నవారు సైతం సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారికి  సగ్గు బియ్యం  మంచి ఆహారం..

సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు.

సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి.

సగ్గుబియ్యంలో ఉండే పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి.

సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.