క్రెడిట్‌ కార్డ్ క్లోజ్‌ చేయాలన్న కస్టమర్ రిక్వెస్ట్ ను గౌరవంగా స్వీకరించాలి

కార్డుదారుడు బకాయిలన్నీ చెల్లించనట్లయితే వారంలోగా క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేయాలి

క్రెడిట్‌ కార్డు మూసివేత సమాచారాన్ని..

ఈ-మెయిల్‌, ఎస్ఎంఎస్ ఇతర పద్ధతుల ద్వారా తెలపాలి.

క్రెడిట్‌కార్డు క్లోజ్‌ చేయాలని అభ్యర్థన వచ్చిన వారంలోపు క్లోజ్‌ చేయకుంటే..

జారీ సంస్థ రోజుకు రూ.500 చొప్పున ఖాతాదారుడికి చెల్లించాలి.

ఏడాదికి పైగా క్రెడిట్‌ కార్డును వినియోగించకపోతే..

కార్డు జారీ సంస్థ అలాంటి కార్డులను క్లోజ్‌ చేయొచ్చు.

ముందుగా ఆ సమాచారాన్ని కార్డు హోలర్డ్ కు తెలపాలి.

ఒకవేళ సదరు వ్యక్తి 30 రోజుల్లోగా స్పందించకపోతే కార్డు జారీ సంస్థనే నేరుగా క్లోజ్‌ చేయొచ్చు.

కార్డు క్లోజ్‌ చేశాక కూడా మిగులు అమౌంట్‌ ఉంటే కస్టమర్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.