చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు గూగుల్ పే, పోన్‌పే, పేటీఎం ద్వారానే యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా యూపీఐ పేమెంట్లపై  ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిసిందే.

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్లపై  భారీగా ఛార్జీలు వర్తించనున్నాయి. 

సామాన్యులపై యూపీఐ అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. 

ఇప్పుడు అందరిలోనూ  ఇదే ఆందోళన కనిపిస్తోంది. 

యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు తప్పవంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్ ప్రతిపాదించడమే.. 

యూపీఐ పేమెంట్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజులు విధిస్తున్నట్టు NPCI ఒక సర్య్యూలర్ జారీ చేసింది. 

యూపీఐ పేమెంట్లు చేసే వినియోగదారులపై  ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వర్తించనున్నాయి.

సాధారణ UPI పేమెంట్లపై బ్యాంక్ అకౌంట్లపై  ఛార్జీలు ఉండవని NPCI స్పష్టం చేసింది.