సరైన మోతాదులో నీరు తీసుకోకపోతే గుండెపోటు?

శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తాగాలి. 

రోజులో ఎంత నీరు తాగాలన్న దానిపై అవగాహన లేకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

దాహం వేసినప్పుడల్లా నీరు తాగాలి.

తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. 

దీని వల్ల అవయవాలు దెబ్బతింటాయి.

చలికాలంలోనూ తగినంత నీరు తాగాలి.

నీరు తాగడం ద్వారా ఊబకాయం, తలనొప్పి, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలను అధిగమించవచ్చు.

రాత్రి పడుకున్న తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.

కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి.

లేకపోతే రక్తం చిక్కగా మారే ప్రమాదం ఉంటుంది.

తద్వారా గుండెకు వెళ్లే మార్గంలో ఇబ్బందులు ఏర్పడి గుండెపోటుకు దారితీయవచ్చని డాక్టర్ల హెచ్చరిక.