బీసీ కులవృత్తులు, చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.

విధివిధానాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం.

కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం.

18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

గ్రామాల్లో రూ.1.50లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉండాలి.

పట్టణాల్లో రూ.2లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉండాలి.

జూన్ 9న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం ప్రారంభం.

ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.

రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర..

కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కుటుంబానికి రూ.లక్ష సాయం.

పనిమూట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం.

జూన్‌ 20 తేదీ వరకు https://tsobmmsbc. cgg.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేదీ నుంచి గత 5ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధి పొందిన వారు, 

2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు అనర్హులు.

ఆర్థికసాయం పొందిన నెలలోగా ఆ నిధులతో పనిముట్లు, ముడిసరుకును లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.