ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

వేసవిలో అధిక దాహం, వడదెబ్బ, నీరసం, అలసట, వంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే వాటిలో ఉల్లిపాయది అగ్రస్ధానమనే చెప్పాలి. 

వేడిని తగ్గించే గుణం కలిగి ఉంది. నీరసం, అలసటను దూరం చేయటంలో బాగా ఉపకరిస్తుంది.

శరీరంలో ఉష్ణోగ్రతల సమతుల్యతకు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయలో యాంటీ హిస్టమైన్ తో కూడిన సిస్టీన్, అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్, ఫ్లేవనాయిడ్స్, క్రోమియం, క్వెర్సెటిన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి హీట్ స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

ఉల్లిపాయలో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేసి,  శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. 

ఉల్లిపాయ రసాన్ని ఎండ కారణంగా ఎర్రబడిన చర్మానికి పూస్తే మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 

ఉల్లిపాయలు వేసవిలో ముక్కు నుండి రక్తస్రావం కాకుండా కాపాడతాయి.

సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, చాట్‌లు, స్నాక్స్ మొదలైన వాటిలో ఉల్లిపాయను జోడించి తీసుకోవటం మంచిది.