స్మార్ట్ ఫోన్‌ ఎక్కువగా వాడితే కంటి సమస్యలు వస్తాయని తెలుసు. 

అతిగా ఫోన్ వాడితే గుండెపోటుకి గురయ్యే ప్రమాదం ఉందని తెలుసా.

స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని చూసినంత సేపు..

మెడను అలా బెండ్ చేసి ఉంచడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతోంది.

ఫలితంగా దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పుల సమస్యల బాధితులు పెరిగిపోతున్నారు. 

తాజాగా స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు. 

అధిక ఒత్తిళ్లు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు గుండె జబ్బులకు కారణం. 

అధికంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో..

గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. 

స్మార్ట్ ఫోన్‌ను పరిమిత సమయం పాటు చూడడమే సమస్యకు పరిష్కారం.