* పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.

* హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.

* మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

* ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి.

* తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

* ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.

* ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.

* తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.

* మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

* ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.