పేపర్ ‘స్ట్రా’ల తోనూ ప్రమాదమే.. క్యాన్సర్ రిస్క్
ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో వచ్చిన పేపర్ స్ట్రాలు.
పేపర్ స్ట్రాతోనూ ఆరోగ్యానికి హాని.
థైరాయిడ్, కాలేయం దెబ్బతినే రిస్క్
దీర్ఘకాలంలో కేన్సర్ కు కారణం.
బెల్జియం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
పేపర్ స్ట్రాలలో ఉండే విషపూరిత రసాయనాలతో ప్రజలు, వన్యప్రాణులకు హాని.
పేపర్, వెదురుతో చేసిన స్ట్రాలలో పాలీ అండ్ పెర్ ఫ్లూరో ఆల్కిల్ పదార్థాలు (పీఎఫ్ఏఎస్) ఉన్నట్టు గుర్తింపు.
దీర్ఘకాలంలో పీఎఫ్ఏఎస్ అనేవి మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్న పరిశోధకులు.
20 బ్రాండ్ల పేపర్ స్ట్రాలపై పరీక్షలు
18 వాటిల్లో పీఎఫ్ఏఎస్ ఉన్నట్టు తెలిసింది.
స్టీల్ స్ట్రాలలో ఇలాంటి హానికారకాలు లేవని అధ్యయనంలో వెల్లడి.
పీఎఫ్ఏఎస్ అనేవి మన శరీరంలో ఏళ్ల పాటు ఉంటాయి.
దీనివల్ల టీకాలకు పెద్దగా స్పందించకపోవడం,
తక్కువ బరువుతో శిశువులు జన్మించడం,
థైరాయిడ్, కొలెస్ట్రాల్, కాలేయం దెబ్బతినడం, కిడ్నీ కేన్సర్, టెస్టిక్యులర్ కేన్సర్ ముప్పు.