ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీకి సంబంధించి అనేక కొత్త చట్టాలు వస్తున్నాయి.

పిల్లలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది.

ఆన్‌లైన్ ప్లాట్ ఫారాల్లో పిల్లల ప్రైవసీ ఆందోళనకరంగా మారింది. 

ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. 

చాలామంది పేరంట్స్ సరదగా దిగిన తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. 

కానీ, ఇకపై ఇలా చేస్తే చట్టరీత్యా నేరం. 

భవిష్యత్తులో సోషల్ అకౌంట్లలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. 

మనదేశంలో కాదులేండీ.. ఫ్రాన్స్ ఈ కొత్త చట్టం అమల్లోకి రాబోతోంది. 

పిల్లల హక్కులకు సంబంధించి ఈ కొత్త చట్టం తీసుకురాబోతోంది అక్కడి ప్రభుత్వం.