ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు
పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా ‘చెప్పాలని ఉంది’ అనే సినిమా కొంత షూట్ కూడా చేసుకుని, పలు కారణాల వల్ల ఆగిపోయింది.
పవన్ తానే డైరెక్టర్‌గా మారి 'సత్యాగ్రహి' అనే సినిమాను తెరకెక్కించాలని చూశాడు. కానీ ఈ సినిమా ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'జీసస్ క్రైస్ట్' అనే
సినిమాను పవన్ స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే అటకెక్కేసింది.
దేశి అనే దేశభక్తి సినిమాను కూడా పవన్ తీయాలని చూశాడు. కానీ ఈ సినిమా కూడా మొదలవకుండానే ఆగిపోయింది.
పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా చేస్తానని అప్పట్లో లారెన్స్ ప్రకటించాడు. కానీ ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.
డైరెక్టర్ వివి వినాయక్ కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా ప్లాన్ చేశాడు. ఇది కూడా ఆదిలోనే ఆగిపోయింది.
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కోబలి అనే సినిమాను పవన్ తీయాలని చూశాడు. కానీ ఈ సినిమాను ఎందుకో ప్రారంభించలేకపోయారు.
సంపత్ నంది డైరెక్షన్‌లో
‘గబ్బర్ సింగ్-2’ సినిమా చేయాలని చూసిన పవన్, అది కాదని
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను
తెరకెక్కించాడు.
ఖుషీ సినిమాకు సీక్వెల్‌గా ఖుషీ2 కూడా పవన్ ప్లాన్ చేశాడు. కానీ అది ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.