కొవ్వులు, క్యాలరీలు అధిక మోతాదులో ఉండే పీనట్ బటర్ బరువును పెంచటంలోనే కాక, బరువును తగ్గించటంలోను ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పీనట్ బటర్ లో ఉండే పీచు పదార్థమే ఇందుకు కారణమని అంటున్నారు నిపుణులు

బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు కలపకుండా ఉండే పీనట్ బటర్ ను తీసుకోవాలి..

ఉప్పు కలిపితే శరీరంలో సోడియం స్థాయులు పెరిగి కడుపుబ్బరంతో పాటు బరువు పెరుగుతారు..

పీనట్‌ బటర్‌ ని తగిన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

అధికమొత్తంలో తీసుకుంటే బరువు తగ్గడానికి బదులు పెరిగే ప్రమాదమే ఎక్కువ.

మార్కెట్లో దొరికే దానికన్నా సొంతగా తయారు చేసుకున్నది తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్‌మీల్‌ తీసుకునేవారు ఓ టీస్పూన్‌ పీనట్‌ బటర్‌ కలుపుకొని తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

పీనట్‌ బటర్‌ను ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌ వంటి వాటితో కలిపి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటిలో చక్కెర, క్యాలరీలు అధికమోతాదులో ఉన్నందున బరువు పెరుగుతారు.